- సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి ప్రారంభించారు

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం, శనివారం, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర జేఏసీ టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చింది.అందులో భాగంగా శుక్రవారం పెద్దపల్లి మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి టోకెన్ సమ్మె సందర్భంగా సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహాయ కార్యదర్శి జి. జ్యోతి మాట్లాడుతూ… గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి, రెండవ పిఆర్సి పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావా లి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి, జీవో నెంబర్ 51ని సవరించాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరి లన్నింటిని కొనసాగించాలి కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలు గానీ నియమించాలి అర్హులైన సిబ్బందిని ప్రమోషన్లు కల్పించాలి, పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి ఇన్సూరెన్స్ ఈఎస్ఐపి సౌకర్యం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయాలి, పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి వేతనాలు పెంచాలి,ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడా వేతనాలు చెల్లించాలి పంచాయతీల అవసరాల ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలి, కార్మికులందరికీ ఇందిరమైన్లు ఇండ్ల పథకాలు కేటాయించాలి, చనిపోయిన అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగం కల్పించాలి. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు దొంత కనకయ్య, మండల అధ్యక్షుడు మామిడిపల్లి తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి, నరేష్, కోశాధికారి బoదరి, అశోక్, ముస్తఫా, నరసయ్య, నాగరాజు, శ్రీనివాస్, శంకరమ్మ, స్వప్న, మల్లమ్మ, లక్ష్మి, రాజయ్య, అన్ని గ్రామాల కార్మికులు కూడా పాల్గొన్నారు.

