-హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి





నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి హెచ్చరించారు. శుక్రవారం ఏసీపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సరం సమీపిస్తుండడంతో డిసెంబర్ 31 దృష్టిలో పెట్టుకొని ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసు సిబ్బంది హుజురాబాద్ ని అష్టదిగ్బంధం చేశారు. జమ్మికుంట రోడ్, హుజురాబాద్ ప్రధాన చౌరస్తా తో పాటు బస్ డిపో క్రాస్ వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేశామన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళతో పాటు బస్టాండు, పాన్ షాప్ లతో పాటు లాడ్జిల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల వద్ద నుంచి వారి వివరాలు సేకరించారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా తాగి వాహనాలు నడపకూడదని అన్నారు.

అలాగే వాహనాల వెంట తప్పనిసరిగా సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. దీంతోపాటు డిసెంబర్ 31న ఉదయం నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు పోలీసుల విస్తృత తనిఖీలు ఉంటాయని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి రోడ్ల పైన ఎవరు కేకులు కట్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. డిసెంబర్ 31 రాత్రి 12 గంటల తర్వాత రోడ్ల పైన మద్యం తాగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో 12 డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలతో పాటు సరైన పత్రాలు లేని 30 వివిధ రకాల వాహనాలను సీజ్ చేశారు. అనంతరం హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపారు. వేరువేరుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై యూనస్ అమ్మద్ అలీ, సైదాపూర్ ఎస్ఐ సిహెచ్ తిరుపతి, శంకరపట్నం ఎస్సై కె రవికుమార్ తో పాటు పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


