- భక్తి భజనలతో హోరెత్తిన శరణు ఘోష
- అయ్యప్పకు అభిషేకాలు
- ఆకట్టుకున్న అరట్టూ
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో స్వయంభు మనీశ్వర అయ్యప్ప స్వామి క్షేత్రంలో విశేష అభిషేకములతో దివ్య పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఉదయం అరట్టు ఉత్సవం నిర్వహించి స్థానిక చెరువులో స్వామికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేపట్టారు. అయ్యప్ప మాలదారులు నృత్యాలు చేసి రంగుల పులుముకున్నారు. రాత్రి ఆలయంలో నిర్వహించిన పడిపూజ మహోత్సవానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై తిలకించారు. భక్తి భజనలు శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ పూజా కార్యక్రమంలో మోకిడే రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు, ఆలయ శాశ్వత ధాత హైదరాబాద్ వాస్తవ్యులు గుప్త ప్రభాకరరావు దంపతులు, పంగిడిపల్లి అయ్యప్ప స్వాముల సమక్షంలో గురువు ఇందుర్తి జానకి రామారావు, ఆలయ అర్చకులు సురేందర్ రావు పాల్గొన్నారు

