నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ రమేష్ కుమార్ పాత్రో: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస నియోజవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష నిండు మనస్సుతో అభిమానం చాలు
పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు తీసుకురండి. పలాస నియోజవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, గజమాలలు, పూల దండలు, దుశ్శాలువలు తీసుకురావద్దని పలాస నియోజవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.
నిండు మనస్సుతో అభిమానంతో శుభాకాంక్షలు చాలు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు జిల్లా పార్టీ ఆఫీస్ 80 ఫీట్ రోడ్ నందు జరుపుకొందురు. బొకేలు, పూల మాలలు, దుశ్శాలువలు తెచ్చే వారు అదే ఖర్చుతో “చదువుకునే పేద విద్యార్థులకు” ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు అందించాలని పలాస నియోజవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.

