Tuesday, January 20, 2026

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి): ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత జిల్లా అధికారులకు అదేశాలు జారీ చేసారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన టి రమాదేవి జూలపల్లి మండలం వడ్కాపురం గ్రామంలోని తమ తండ్రి భూములు కబ్జాకు గురయ్యాయని, వీటి విషయమై మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పాస్ పుస్తకం రాలేదని, తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జూలపల్లి తాసిల్దార్ కు రాస్తూ విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంథని మండలం అడవి నాగ పల్లి గ్రామానికి చెందిన తోటపల్లి గుట్టయ్య తన తండ్రి పంట పొలాల కాసరి ఉద్యోగం వారసత్వంగా తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ అర్హతలను పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగిరి మండలం జల్లారం గ్రామానికి చెందిన లివ్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థ ఎన్.జి.ఓ భవన నిర్మాణానికి ఐదు గుంటల స్థలం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సూపరింటెండెంట్ ఈ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News