- గోవిందపురంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రీడ పోటీలు
- నియోజకవర్గస్థాయి గ్రిక్స్ పోటీలు
నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస : నియోజవర్గ స్థాయి క్రీడా ( గ్రిక్స్ ) పోటీలను ఎంఎల్ఏ శ్రీమతి గౌతు శిరీష ప్రారంభించారు. సోమవారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు మరియు మరియు వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ తో కలిసి క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేశారు. స్కూల్ గేమ్స్ పెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14, 17 బాలబాలికల నియోజవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ శిరీష గారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలలో ఆసక్తి కనబరిచి రాణించాలని కోరారు. క్రీడల వల్ల శరీరానికి కావలసిన వ్యాయామం, ఆరోగ్యం, దృఢంగా ఏర్పడుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు మండల టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

