
నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం లోని పలు పరామర్శలలో భాగంగా “కొల్లిపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ గొరుసు. సవరయ్యకి మాతృవియోగం” కలిగిన విషయం దువ్వాడ శ్రీనివాస్ తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బోరుభద్ర గ్రామం లో “వైసీపీ వార్డు సభ్యులు పొందూరు చలపతి సోదరుడు” ఇటీవల కాలంలో చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం “కాకరపల్లి లో వైసీపీ కార్యకర్త ముడిదాన. సింహాచలం కుమారుడు” ఇటీవల కాలం లో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యలను పరామర్శించారు.తదనంతరం “కాశీపురం గ్రామం లో వైసీపీ కార్యకర్త గేదెల. చంద్రరావు కి పితృవియోగం” చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమం లో సంతబొమ్మాళి మండలం జేసీయస్ కన్వీనర్ మోడి. భాస్కర్ రెడ్డి, మేఘవరం సర్పంచ్ పరపటి. శ్రీనివాస్ రెడ్డి, కొన్న శ్రీరాములు, లక్కివలస సర్పంచ్ వీరాస్వామి, పాలతలగాం సర్పంచ్ నరేష్ కాకరపల్లి వైసీపీ నాయకులు పాపారావు సింహాచలం, పొందల నరేంద్ర, మోహన్ గారు, సింహాచలం గారు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

