నేటి సాక్షి,రామడుగు : రామడుగు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు అయిన జీ.లిఖిత, బి. హర్షిత జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రమేష్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీకాంత్, సంధ్యారాణి ఉన్నారు.

