- స్థానిక హమాలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
- గొంగళ్ల రంజిత్ కుమార్
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : గద్వాల మండలంలోని పూడూరు గ్రామ శివారులో ఉన్నటువంటి గోదాములలో ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉపాధి కల్పిస్తుందని అట్లాంటి వాటిని ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడమే కాక స్థానిక హమాలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గతంలో చుట్టుపక్కల గ్రామాలలో డబ్బులు వసూలు చేసి ఉపాధి కల్పిస్తామన్న యాజమాన్యం వేరొకరికి విక్రయించాక స్థానిక రాజకీయ కారణాలతో సమస్యలు సృష్టిస్తే ఏడు సంవత్సరాల తర్వాత చట్టపరంగా అన్నిటిని దాటుకొని ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి హమాలీ లు మరియు లారీ డ్రైవర్ మరియు క్లీనర్లు ఉపాధి దొరికిందన్న సంతోషంలో ఉండగా మళ్లీ అడ్డంకులు స్పృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, జిల్లాలోనే అత్యధికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న గోదాములలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కన్వీనర్ బుచ్చిబాబు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు శ్రీనివాస్ యాదవ్, రంగస్వామి, ప్రేమ్ రాజ్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

