- నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
- లక్షెట్టిపేట సబ్ ఇన్స్పెక్టర్ సతీష్
నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న ) :
రాత్రి తాగి బైకు నడపడం, వినోదం విషాదంగా మారకుండా, బైకులపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ, కేరింతలు కొడుతూ, బైకులను స్నేక్ డ్రైవింగ్ చెస్తూ, తోటి వారికీ ఇబ్బంది కలిగిస్తూ, అశాంతి వాతావరణం కలిగించాలని చూస్తే వారిని గుర్తించి, వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని లక్షెట్టిపేట ఎస్సై సతీష్ పేర్కొన్నారు. సోమవారం అయన పట్టణ, మండల ప్రజలకు డిసెంబర్ 31 రాత్రి ఎలా ఉండాలో పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాత్రి 12 గంటల తరువాత రోడ్ల పై కేకులు కట్ చేసినా, డీజేలు పెట్టి డాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగ అతి ఉత్సాహం చూపిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ, ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రజల ఆస్తులని కానీ, ధ్వంసం చేస్తే వారిపై కేసు కావడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నూతన సంత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమములో అసభ్య సందేశాలు, అసభ్య ఫోటోలు పంపించిన, అసబ్య ఆడియోలు పంపిస్తే వారిపై చట్ట రీత్యా చర్యలుంటాయ్యన్నారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించబదుతుందన్నారు. తల్లి దండ్రులు మీమీ పిల్లలతో కలిసి కుటుంబ సమేతముగా ఇళ్లలోనే వేడుక జరుపుకోవాలన్నారు. క్షణికా ఆవేశంలో తాత్కాలిగా ఆనందం కోసం చేసిన చర్యల వలన ప్రమాదము జరిగినా, అది మీ కుటుంబంలో తీరని నష్టం, పిల్లల భవిష్యత్తు నాశనం కావడం జరుగుతుందన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో అపరిచిత వ్యక్తులు పెట్టె లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఓపెన్ చేయకూడదని, అలా ఓపెన్ చేస్తే మీ ఫోన్ హాక్ అయి సైబర్ ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మీ కుటుంబములో మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కొసం, అభివృద్ధికి ఉపయోగపడేలా, కొత్త ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో మీ ఇల్లు, మీ గ్రామములలోని, పట్టణం లోని ప్రతి కుటుంబం ఈ నూతన సంత్సరములోనికి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ న్నామన్నారు.

