- ఎస్సై తిరుపతి
నేటి సాక్షి, సైదాపూర్: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సైదాపూర్ ఎస్సై సి.హెచ్. తిరుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం కాని, బాణాసంచాలు పేల్చడం కాని చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. ఒక్కసారి కేసులు నమోదైతే, చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో తమ తమ ఇండ్లలోనే జరుపుకోవాలన్నారు.

