- ఆకుల స్వామి వివేక్ పటేల్, కోమటిపల్లి రాజేందర్ నేత
నేటి సాక్షి పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : పెద్దపల్లి జిల్లా సర్వ శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని 21 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను సోమవారం ఆకుల స్వామి వివేక్ పటేల్ స్టేట్ కన్వీనర్ జేఎన్టీయూహెచ్ జాక్, సామాజిక కార్యకర్త, బీసీ సంఘం నాయకులు కోమటిపల్లి రాజేందర్ నేత వారిని కలిసి సంఘీభావం ప్రకటించి వాళ్లని ఉద్దేశించి మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ సర్వ శిక్ష ఉద్యోగుల హక్కు అన్నారు. 19600 ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని ఉద్యమ స్ఫూర్తిని నింపారు, వైబ్రేట్ ఎడ్యుకేషనల్ సొసైటీ సొసైటీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు.సందీప్, సంతోష్ సర్వ శిక్ష ఉద్యోగులు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, బృంద సభ్యులందరూ పాల్గొన్నారు.

