- భీంపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు
నేటిసాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశానుసారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఘనంగా కొవ్వొత్తి ర్యాలీలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భీంపల్లి దొరగారి వేపచెట్టు కూడలిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప దినాలలో భాగంగా కొవ్వొత్తులతో ర్యాలీ తీసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కమలాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుక్కల కుమార్, టి.పి.సి.సి. సోషల్ మీడియా హుజురాబాద్ కో కోఆర్డినేటర్ వాసాల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి రాజన్, తోట శంకర్, కొల్లూరి రమేష్, గుండారపు మధు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎండి తాజ్, రామగిరి రామచందర్, కురిమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సులుగురి సంతోష్, సులుగురి ప్రశాంత్, ఎం.డి రఫీ, ఎం.డి జలీల్, కురిమిండ్ల ప్రసాద్, రావుల మహేందర్, రావుల శివ, బచ్చల గణేష్, ఆకినపెల్లి అజయ్, రొంటాల అశోక్, పబ్బు కుమారస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.

