నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :
కబ్జా చేసిన తన భూమిని తనకు ఇప్పించాలని ఎనబై యేండ్ల పెద్దావిడ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ కు విన్నవించుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన వేముల నాగవ్వ అనే వృద్ధురాలికి వేములవాడ శివారులో 696, 697 సర్వేలో ఏకరం ఇరవై గుంటల భూమి కబ్జాకు గురైనట్టు తెలిపింది. ఈ సందర్భంగా నాగవ్వ మాట్లాడుతూ వేములవాడకు చెందిన పోనుగంటి బుచ్చయ్య అనే అతను నాగవ్వకు తెలియకుండా కబ్జా చేసి పట్టా చేసుకున్నాడని తెలిపింది. చాలా ఏండ్లుగా మా భూమిలో పంట పండించుకున్నామని, గత 20 ఏళ్ల క్రితం తన భర్త పెంటయ్య చనిపోతే భూమిలోనే అంతక్రియలు చేసి సమాధి కట్టామని నాగవ్వ తెలిపింది. తమకు తెలియకుండా తమ భూమిని వేములవాడ పట్టణానికి చెందిన బుచ్చయ్య కబ్జా చేశాడని నాగవ్వ కన్నీళ్లు పెడుతూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ కు తన గోడును విలపించింది

