- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నేటి సాక్షి, రామడుగు:
ప్రజల సౌకర్యార్థమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ సందర్భంగా రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో 10 లక్షల రూపాయలతో మంగళవారం సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, బొమ్మరవేణి తిరుపతి, మాజీ సర్పంచ్ నరసింగరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, పంజాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

