- నియోజక వర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రణవ్


నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
యాసంగి సీజన్ సంబంధించి రైతులకు కాకతీయ కెనాల్ ద్వారా మంగళవారం నుండి విడుదల చేశామని దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టు సాగుకు నీటి విడుదలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రెగ్యులేటర్ గేటు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గతంలో చెప్పినట్టుగా రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని తెలిపారు. సన్నాలకు బోనస్ తో రైతుల్లో సంతోషం నింపామని సంక్రాంతి నుండి రైతు భరోసా నిధులు విడుదలకు సన్నహకలు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరసిల్లాలని, నాపై ఉంచిన నమ్మకాన్ని మరింత బాధ్యతయుతంగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.

