నేటి సాక్షి, బెజ్జంకి:
మండల పరిధిలోని గుండారం గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం (55) పచ్చకామర్ల వ్యాధితో బాధ పడుతుండడంతో పాటు తాగుడుకు బానిసగా మారాడు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు.
సోమవారం భాగ్యలక్ష్మి కూలి పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి మల్లేశం ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉరివేసుకొని చనిపోయినట్లుగా మృతుడి కుమారుడు సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జే. కృష్ణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌కి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు

