నేటి సాక్షి, మంథని (పెయ్యల రమేష్):
బుధవారం రోజున మంథని మండలంలోని అడవిసోమన్ పల్లి గ్రామానికి చెందిన కడారి లక్ష్మి (51) అనే వ్యవసాయ మహిళాకూలి తన వ్యవసాయ పొలం వద్ద ఒడ్డుపై గడ్డి కోస్తుండగా ఒడ్డు పై ఉన్న బోరు వైరును గమనించకుండా కోయగా కరెంటు వైర్ తెగి విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ ఘాతంతో చనిపోయినదని ఆమె కూతురు సడిరం రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

