నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్ (టి.ఎన్ రమేష్):
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రతినెల ప్రోటోకాల్ పేరిట ఇంచార్జ్ ఏ.ఈ.ఎస్ జేబులనింపడమే పరమ విధిగా కొనసాగుతుందని, వసూళ్ల పరంపర కొనసాగిస్తున్న వారు సైతం వారి వారి స్థాయి సోమతకు తగిన విధంగా ముడుపులు వెనకేసుకుంటున్నట్టు జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా విధులకు విరుద్ధంగా తమ స్వార్థం కోసం ఉద్యోగులను మరియు ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని ఏ ఈ ఎస్ ఇలాంటి లంచాల పరంపరకు శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈయన చిట్టా, వాస్తవాలే వార్తలుగా వెలుబడుతున్న నేటి సాక్షి దినపత్రిక బట్టబయలు చేయడంతో ఆ శాఖలోని అవినీతి అధికారుల్లో గుబులు మొదలైందని విశ్వసనీయ సమాచారం. తప్పు చేయడం తప్పించుకు తిరగడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య అని కొందరు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అక్రమ వసూళ్ల పరంపరాన్ని ప్రోత్సహిస్తున్న సంబంధిత ఇంచార్జ్ ఏ ఈ ఎస్, ఇతర లంచావతారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే వీళ్ళ విషయంలో కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖలో లంచాల అధికారులు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రోటోకాల్ పేరిట లంచాలను మేసే అక్రమార్కులపై ఏసీబీ అధికారులు సైతం దృష్టిసారించాలని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

