
నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్:
గురువారం రోజు ఉదయం 10 గంటలు మొదలుకొని, మధ్యాహ్నం వరకు మాల, మాదిగ కుల సంఘాల, యువజన సంఘాల నాయకులతో, నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సందడిగా మారింది.
ఆగస్టు ఒకటవ తేదీ 2024 రోజున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రివర్గం వర్గీకరణను చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ వచ్చిన తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు, గురువారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక, అనుకూల నిర్ణయాలను, మాల మాదిగ కుల సంఘాలు యువజన సంఘాలు తమ తమ అభిప్రాయాలను తెలియజేయాలని జస్టిస్ డాక్టర్ షమీంఅక్తర్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయమై కమిటీ ఏర్పాటు చేయడంతో, మాల, మాదిగ కులాలతోపాటు మరికొన్ని ఉపకులాల కుల సంఘాలు, యువజన సంఘాల నాయకులు వారి వారి అభిప్రాయాన్ని కమిటీకి లేఖల ద్వారా తెలియజేసారు. గురువారం రోజు నిజాంబాద్ జిల్లా కలెక్టరేట్లో, మాల మాదిగ మరియు ఉపకులాల నాయకులతో కలెక్టరేట్ కిక్కిరిసి పోయింది. ఇందులో కుల సంఘాలు యువజన సంఘాలతో పాటు కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన దళిత నేతలు పాల్గొన్నారు.

