నేటీ సాక్షి ప్రతినిధి వనపర్తి : వనపర్తి పట్టణంలో పీర్లగుట్ట ఒకటోవ వార్డు లో అంగన్వాడి సెంటర్లో డి డబ్యూ ఓ,మేడం లక్ష్మమ్మ మాట్లాడుతూ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే ప్రోగ్రాంని నిర్వహించామని అన్నారు.విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే లో ప్రతి పిల్లవాడికి సంపూర్ణ టీకాలు ఇవ్వాలని కోరారు. ప్రతి గర్భిణీ స్త్రీ ని సహజ ప్రసవానికి ప్రోత్సహించాలని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని వైద్య సిబ్బంది, ఆశలందరూ ఆదిశగా పని చేయాలని కోరారు. స్త్రీలు గర్భవతి గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి ఆహారం గురించి తగు సూచనలు చేశారు.

బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి గర్భవతులకు పలు జాగ్రత్తలు తెలియజేశారు. మరియు స్త్రీలు ఆరు నెలల వరకు తల్లిపాలు పిల్లలకు ఇవ్వాలని చెప్పారు. అలాగే ఆకుకూరలు తింటే చాలా పోషకాలు బలం వస్తుంది అని తెలియజెప్పారు. అంగన్వాడి సెంటర్లో ఆరు నెలలు దాటిన పాపకు విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే సందర్భంగా అంగన్వాడి సెంటర్లో అన్నప్రాసన చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భారతి, అంగన్వాడి టీచర్ రామచంద్రమ్మ, ఆయా ఉమ బాయ్.ఆశ వర్కర్ పారిజాత, అలాగే గర్భవతులు, బాలింతలు మరియు ప్రీస్కూల్ పిల్లలు కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

