- భారతీయ జనతా పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
బుధవారం వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు వనపర్తి జిల్లా వనపర్తి పట్టణ రాజనగరం లో ప్రాథమిక పాఠశాల వడ్డే గేరి ఉన్నత పాఠశాల ఓ బి సి మోర్చా వనపర్తి పట్టణ అధ్యక్షుడు రాజనగరం రవి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారు ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి బిజెపి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము పాల్గొనడం జరిగింది.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుల అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి చేసిన ప్రధాని అయిన తర్వాత ప్రజలకు విద్యార్థులకు స్కూళ్లకు రైళ్లకు ప్రతి ఒక్కరికి వాజ్పేయి ఎన్నో కార్యక్రమాలు దేశంలో చేపట్టడం జరిగింది. కాబట్టి వారి ఆశయాలను అడుగుజాడల్లో నడవాలని పిలుపునివ్వడం జరిగింది నేటి భారత విద్యార్థి విద్యార్థులు రేపటి పౌరులు అని చెప్పి వారు ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిందిగా స్కూల్ యాజమాన్యానికి చెప్పారు. ఊరు బాగుంటే దేశం బాగుంటది అని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులకు చక్కటి బోధన మరియు చదువు ఆటలు వారికి మంచి చక్కటి భోజనం అందించాలని సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ నారాయణ కౌన్సిలర్ గోపాల్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బాల చంద్రయ్య, బిజెపి రవి రాఘవేందర్, రాజు, నక్క శీను, సంజీవరెడ్డి,మల్లేష్,శివ వంశీ కార్యకర్తలు పాల్గొన్నారు.

