
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
వేములవాడ పట్టణంలోని భగవంత రావు నగర్ ఆనుకొని ఉన్న గుడి చెరువు ఎఫ్ టి ఎల్ ను ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఇరిగేషన్ డిఈ ప్రశాంత్ లు గురువారం పరిశీలించారు.

కట్టు కాలువ నుండి భగవంత రావు నగర్ మీదిగా జగిత్యాల బస్టాండ్ వరకు గుడి చెరువులో మురికి నీరు చేరకుండా మూడు కోట్ల రూపాయలతో మురికి నీటి మళ్లింపు పనులు కొనసాగుతున్నాయి. అయితే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం చేస్తుండగా భగవంతరావు నగర్ గుడి చెరువును ఆనుకొని ఉన్న పట్టా భూముల నుండి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతర వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లకు తమ పట్టా భూముల్లో నుండి వేయవద్దని కోరారు.


