నేటిసాక్షి, జమ్మికుంట :
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఎస్ టి ఓ శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజు జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎస్ టి ఓ కార్యాలయంలో సూపరిండెంట్ కూతాడి ప్రభాకర్ చే టా ప్ర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరింపజేయమైనది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ఆధ్యక్షులు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ టా ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ మరియు సింగరేణి కార్మికుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి ఏకైక సంస్థ అని తెలిపినారు.కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తాను మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన పి ఆర్ సి ని జూలై 2023 నుండి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం సరియైన విధానం కాదని మాట్లాడుతూ వెంటనే అమలు చేస్తూ పెండింగ్ లో నున్న నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరినారు. ఆర్టీసీ సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ 15 వేల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినారు. కార్యక్రమములో జమ్మికుంట శాఖ అధ్యక్షులు గరిగ చంద్రయ్య, ఆధ్యక్షులు శీలం మల్లేశం, హుజురాబాద్ శాఖ ట్రెజరరీ మండల వీరస్వామి, నాయకులు మారేపల్లి మొగిలయ్య, ముక్క ఐలయ్య ,మేక మల్ల సుధాకర్, శీలం సారా భద్ర స్వామి, ఎండి హసన్, శీలం దేవదాసు, ఖాజా మొయినుద్దీన్, బొల్లి సమ్మయ్య, కడారివిజయలక్ష్మి మరియు ఎం శ్రీధర్, పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

