- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) :
నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆనందం నింపాలని, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలలో సంతోషం వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకాంక్షించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ లు డి.వేణు, జే.అరుణశ్రీ లకు నూతన సంవత్సరం సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ప్రజలకు అందించుటకు ప్రణాళికబద్ధంగా పని చేయాలన్నారు.నూతన సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైనా ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు గ్యారెంటీ పథకాల అమలు, పల్లె పట్టణ ప్రాంతాల అభివృద్ధి చర్యలు, ఆర్.ఓ.బి బ్రిడ్జి, జాతీయ రహదారుల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా జరిగేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉద్యోగులు సఫలీకృతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధులు విజయవంతంగా చేస్తూనే మన వ్యక్తిగత బాధ్యతలను సైతం పక్కగా నిర్వహించుకోవాలని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

