- గోదాం కార్మికుల సమస్యలపై రాజకీయం సరికాదు
- గోదాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2వేల కుటుంబాలకు ఉపాధి
- త్వరలో కార్మికుల యూనియన్ ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటాం
- హమాలీల ఆహ్వానంతో కార్మికుల సమస్య సమావేశంలో పాల్గొన్న
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్, రంజిత్ కుమార్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల: గద్వాల మండలంలోని పూడూరు గ్రామ సమీపంలో ఉన్న గోదాములలో స్థానిక కార్మికులకు కాకుండా ఇతర రాష్ట్రాల కార్మికులను తీసుకొచ్చి స్థానిక కార్మికులకు అన్యాయం చేస్తున్నారని స్థానికులకు మాత్రమే ఇక్కడ పని కల్పించాలని పూడూరు గోదాం హమాలీలు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ హాజరై మాట్లాడారు. అంతకు ముందు గోదాం కార్మికులు గొంగళ్ళ రంజిత్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి కార్మికుల సమస్యలను పరిష్కరించెందుకు న్యాయ బద్ధమైన డిమాండ్ సాధన కోసం కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ పూడూరు, ఎర్రవల్లి, జమ్మిచేడు, మేలచెరువు, జంగంపల్లి, కొండపల్లి తదితర గ్రామాలలో సుమారు 600 మందికి పైగా గతంలో 40 వేల నుండి లక్ష రూపాయల దాకా స్థానిక గోదాములు ప్రారంభమవుతే అందరికీ పని కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని, ప్రస్తుతం వీరికి కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వారికి ఉపాధి కల్పించారని అన్నారు. రాజకీయ కుట్రలతో ఇన్ని సంవత్సరాలు గోదాములను నడవకుండా చేశారని ప్రస్తుతం అన్ని సమస్యలను పరిష్కారం చేసుకొని చట్టబద్ధంగా ప్రారంభమైన గోదామును కొంతమంది రాజకీయ కుట్రతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయపరంగా సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారో దీనికి సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అట్లాంటి గోదామును కేవలం రాజకీయ కుట్రతో అడ్డుకోవడం తగదని హెచ్చరించారు.గతంలో స్థానిక గ్రామాలకు చెందిన కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఇక్కడ గోదాము వస్తే మాకు ఉపాధి దొరుకుతుందన్న ఆశతో డబ్బులు కట్టి 14 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు మాకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వీరికి ఉపాధి కల్పించేలా యాజమాన్యంపై నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఒత్తిడి తీసుకొస్తామని జిల్లాలోనే అత్యధికంగా ఉపాధి కల్పించే ఈ గోదాములను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులకు అందరికీ ఉన్నదని అన్నారు. గోదాంలో పనిచేస్తున్న కార్మికులకు త్వరలో కార్మికుల యూనియన్ ఏర్పాటు చేసి అండగా ఉంటూ వారి సమస్యను పరిష్కరించేంతవరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ బుచ్చిబాబుతో పాటు కార్మికులు అశోక్, దేవకుమార్, ఆంజనేయులు, మహేష్, ప్రభాకర్, బాలరాజు, నరసింహులు, పరశురాముడు రామకృష్ణ, సురేష్, ఎర్రవల్లి బాలరాజు, రాముడు, పూడూరు బాబు, ధోని వీరితో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండల అధ్యక్షులు బి. విష్ణు, నెట్టెంపాడు గోవిందు, భూపతి నాయుడు, లక్ష్మన్న, బాసు అంజి, రఘుపతి, రమేష్, వెంకటేష్, చిన్నరాముడు,గోపాల్, దొడ్డన్న, జమ్మన్న, తదితరులు పాల్గొన్నారు.

