పెగడపల్లి:నేటిసాక్షి (కె. గంగాధర్) :
పెగడపల్లి మండలంలోని వెంగలాయిపేట గ్రామానికి చెందిన ఆత్మకూరి చంద్రయ్య (చందు) అను వ్యక్తి తన యొక్క మొబైల్ ను పోగొట్టుకొని గత వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫిర్యాదును CEIR పోర్టర్ నందు నమోదు చేసి ఫిర్యాది యొక్క మొబైల్ ను కనుక్కొని ఈరోజు అట్టి వ్యక్తికి మొబైల్ ను ఎస్ఐ సి.హెచ్.రవికిరణ్ అప్పగించడం జరిగింది. పోయిన తన ఫోన్ తిరిగి అప్పగించినందుకు ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

