- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ విజ్ఞప్తి
నేటి సాక్షి ప్రతినిధి తిరుపతి జిల్లా : హెల్మెట్ లేకుండా బైక్ నడపడం మీ జీవితం కోసం అత్యంత ప్రమాదకరమని మరోసారి గుర్తుచేసేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. నిన్నటి రోజు తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన 23 సంవత్సరాల యువకుడు దిల్లీప్ హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా బైక్ నడపడం కారణంగా రోడ్డు మీద పడిపోయి తలకు తీవ్రమైన గాయాలవచ్చాయి. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు,హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ట్రాఫిక్ నియమాలను పాటించడం మీ బాధ్యత. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. మనకోసం బ్రతికే వాళ్లు, మనపై ఆధారపడే వాళ్లు ఉన్నారు. మీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టకండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. యువత గమనించండి, ఇది మీ భవిష్యత్తు కోసం.

