- గౌళ పద్మావతి అలియాస్ రజిత నియామకం
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జిల్లా దిశ కమిటీ సామాజిక కార్యకర్త గౌళ పద్మావతి అలియాస్ రజిత నియామకం . అయ్యారు సభ్యురాలిగా ఐజా మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త గౌళ పద్మావతి అలియాస్ రజిత నియామకం. అయ్యారు
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో జిల్లాలో అభివృద్ధి పనులను సమీక్షించడానికి గాను జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ ) ఆ పార్లమెంట్ సభ్యులు అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ మెంబెర్ సెక్రటరీ అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులతో పాటు నలుగురు అనధికార సభ్యులను నియమిస్తారు. వీరిలో ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 27 రకాల పథకాలను ఈ కమిటీ మూడు నెలలకు ఒక సారి సమీక్ష చేసి క్షేత్ర స్థాయిలో అమలులో ఏమైనా లోపాలు కానీ లేదా అమలుకు తగు సూచనలు చేస్తుంది. గద్వాల జిల్లా దిశ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యం లో ఈ మధ్యనే జిల్లా మొదటి సమావేశం జరిగింది. ఎంతో ముఖ్యమైన దిశ కమిటీలో స్థానం దొరికినందుకు రజిత సంతోషం వ్యక్తపరుస్తూ కమిటీ బాధ్యతను విద్యా విషయం లో దృష్టి సారించి గద్వాల జిల్లాను విద్యా ను పటిష్టము చేయడానికి కృషి చేస్తానని వెల్లడించారు.

