సావిత్రిబాయి పూలేకు నివాళి అర్పించిన కూతురు విధ్వాన్ రెడ్డి

నేటి సాక్షి,సైదాపూర్:
సైదాపూర్ మండల కేంద్రంలో జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక సైదాపూర్ అంగన్వాడి సెంటర్ 3 నందు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి జయంతిని నిర్వహించడం జరిగింది. అంగన్వాడి టీచర్ తాళ్లపెల్లి రమ ను స్థానిక నాయకులు కూతురు విధ్వాన్ రెడ్డి శాలువతో సన్మానం చేసి పిల్లలకు స్వీట్ పంచడం జరిగింది. కూతురు విద్వాన్ రెడ్డి ఇట్టి కార్యక్రమం గురించి మాట్లాడుతూ జనవరి 3వ తేదీని ‘మహిళా టీచర్స్ డే’గా నిర్వహించడం సావిత్రిబాయి ఫూలే జయంతిని ఇప్పటికే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్న సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మాట్లాడుతూ మహిళలు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగు అని చాటిన సావిత్రిబాయిపులే, సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడి దేశంలో మొదటి మహిళా పాఠాశాలకు పునాదులు వేశారు అని స్మరించుకుంటూ ఇట్టి కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యావంతులు గాదపాక కుమార్ రాజా, పొడిశెట్టి శ్రీకాంత్, గదపాక అశోక్, గాదపాక నరసింహ, గున్నల కృష్ణమూర్తి, పోలోజు రాజు, ఖమ్మం రమేష్, పొడిశెట్టి నరేష్, బోనగిరి అనిల్, బత్తుల శ్రీనివాస్, పొడిశెట్టి అశోక్, స్థానిక మహిళలు, పిల్లల, తల్లులు పాల్గొన్నారు.

