Wednesday, January 21, 2026

ఘనంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

నేటి సాక్షి, అన్నమయ్య, జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే జన్మదిన పురస్కరించుకొని మండల విద్యాశాఖ కార్యాలయము లక్కిరెడ్డిపల్లి నందు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె జీవితం గురించి తెలియజేయడం జరిగింది. 1831 జనవరి మూడో తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించింది 1840లో జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. ఆ తర్వాత 1848లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా భారత దేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్ర పుట్టల్లో నిలిచిపోయింది. అని మండల విద్యాశాఖ అధికారి నాయక్ గారు మరియు వెంకటసుబ్బయ్య గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం. చక్రి నాయక్ ఎంఈఓ 1, వెంకటసుబ్బయ్య ఎం ఈ ఓ 2, ఏపీఎం నిరంజన్, కంప్యూటర్ ఆపరేటర్ మల్లికార్జున, ఎంఐఎస్ రామానుజులు, అకౌంటెంట్ బాబా ఫక్రుద్దీన్ మరియు సి ఆర్ ఎం టి లు చంద్రకళ, సుహాసిని రామ్మోహన్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News