- జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్
నేటిసాక్షి/మంగపేట: విద్యార్థిని విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శుక్ర వారం “సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” సందర్భంగా ఆయన మండలంలోని అకినేపల్లి మల్లారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల విద్యాభ్యాసన సౌకర్యం కోసం రూ యాభై వేల విలువైన ఇరువై బెంచ్ లను పాఠశాల విద్యార్థులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను విద్యను అభ్యసించిన పాఠశాల పేద విద్యార్థుల సౌకర్యార్థం బెంచిలను బహుకరించటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి పుట్టి పెరిగిన ఊరు కోసం పాటుపడాలన్నారు. పాఠశాల అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందని గత సంవత్సరం తన జన్మదిన కానుకగా పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూలు బ్యాగులు నోటు పుస్తకాలను పంపిణీ చేశామని ఇప్పటికి మూడు పర్యాయాలు స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా పాత పాఠశాల భవన పునరుద్ధరణ కోసం అవసరమైన సిమెంటును విరాళంగా అందజేస్తున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు. అంతేకాకుండా యాన్మార్ సంస్థ సహకారంతో పాఠశాలలో త్వరలో రక్షిత మంచినీటి వాటర్ ఆర్వో ప్లాంట్ ని మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సాంబశివరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన సాంబశివరెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బోదెబోయిన నరసింహారావు ఉపాధ్యాయులు సరోజ రామ్ సింగ్ దుర్గాప్రసాద్ ప్రవీణ్ కుమార్ పతాన్ అస్మా బేగం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

