నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను శుక్రవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నంద్యాడపు అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా కూర్మచెలం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా పోగుల మోహన్, కోశాధికారిగా ఆకుల గంగాధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్యూజే, ఐజేయూ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎలిగేటి సూర్యకిరణ్, దేశవేణి ధర్మేష్, బింగిశెట్టి వెంకటేష్, సుగిగెపు పరుశురాం, ఎలిగేటి ప్రదీప్, తుమ్మనపల్లి శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

