

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజూరాబాద్ టౌన్, జనవరి 3: ఈనెల 2 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్… భోపాల్‌లో జరుగుతున్న ఎస్టీఎఫ్ అండర్- 14 బాలుర హాకీ జట్టుకు హుజూరాబాద్ వాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మారుతీనగర్‌కు చెందిన మోటపోతుల విక్రమ్ జట్టు మేనేజర్‌గా, సాధుల శ్యామ్ సుందర్ కోచ్, యేముల రవికుమార్ డిపార్ట్మెంట్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, వీరి ఎంపిక పట్ల హుజూరాబాద్ హాకీ క్లబ్ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం పేరు దేశంలో మారుమోగేలా కృషి చేయాలని హాకీ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు.

