నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన కళాశాల విద్యార్థి జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న గుల్లకోటకు చెందిన మడ్డి వంశీ (17) గత అక్టోబర్ 03 నుండి 5వ తేదీ వరకు మెహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎస్జిఎఫ్ అండర్-17 హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మోడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనాడు. ఈ సందర్భంగా తమ కళాశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ దురిశెట్టి అనంత రామకృష్ణ, అధ్యాపకులు విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించి, జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

