నేటి సాక్షి చేర్యాల : చేర్యాలలో అంగడి బజారులోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ స్త్రీ జాతి ఆణిముత్యం ఆమె కరుడుగట్టిన బ్రాహ్మనిజం కబంధహస్తాల నుంచి స్త్రీ బయటకు వెళ్ళాలంటే పరదా వేసుకోవాలని శాసించిన సమాజాన్ని చీల్చి సమస్త భారత మహిళ లోకానికి స్వేచ్ఛ, స్వాతంత్రా లు ప్రసాదించిన ఆమె తను చదువుకుని సాటి స్త్రీలకు విద్య చెప్పటానికి రాళ్లు, రప్పలు, పేడ, పిడికలు, తన మీద పడుతున్నా వాటిని పువ్వుల్లా భావించి లక్ష్య సాధనలో వెనుకడుగు వేయలేదు. పురుషులే కాదు, సాటి స్త్రీల సూటిపోటి మాటలను ఆశీర్వచనాలుగా ముందుకు సాగిన మహేమాన్విత ఆ స్త్రీ మూర్తి మహాస్వాద్వియే సావిత్రి భాయి ఫూలే…. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారిణి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులకు కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ అధ్యక్షులు పుట్ట రాజు, డివిజన్ అధ్యక్షులు చింతల విజయ్ కుమార్, రిటైర్డ్ ఉద్యోగస్తులు గుస్క రాందాస్, పుట్ట యాదయ్య, శ్రీరాం మల్లయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చంద శ్రీకాంత్, చేర్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలు గుస్క వాసంతి, మండల నాయకులు గుస్క గోవర్ధన్, పుట్ట ఐలయ్య, గుస్కవెంకటేష్, పట్టణ అధ్యక్షులు బుట్టి సాయికుమార్, ఎనమల యాదమ్మ, ఒలిమి సావిత్రి, కమలాపురం వీరమణి, అధిక సంఖ్యలో మహిళలుపాల్గొన్నారు.

