నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మహిళల అక్షరాస్యత కోసం శ్రమించిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాలతో మహిళ ఉపాద్యాయ దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో పాటు కార్యాలయాల్లో సావిత్రి బాయి పూలే బడుగుల, మహిళల విద్యా అభ్యున్నతికి అందించిన సేవలను కొనియాడుతూ మహిళ ఉపాద్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించి ఈ సందర్బంగా మహిళ ఉపాధ్యాయురాల్లను ఆయా పాఠశాలల్లో సన్మానించారు. మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సభ్యులు సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని అమె చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళిలర్పించారు. అనంతరం వారు మాట్లడుతూ… మహిళల సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రి బాయి పూలే అని, కుల మత భేదాలకు అతిథంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణిగా వారు అభివర్ణించారు. సమాజ హితం కోసం మహిళలను చైతన్యం చేసేందుకు అమె సాగించిన పోరాటాలు, ఆశయాలను మహిళలు స్ఫూర్తిగా తీసుకుని విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు నగేష్, తిరుపతి, రాజేందర్, రవి, ప్రశాంత్, పవన్, సాయి, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

