నేటి సాక్షి,మంథని (పెయ్యల రమేష్):
డిసెంబర్ 29,30,31 తేదీలలో మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శిక్షకులు రాష్ట్ర రిఫరీ కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ సిటోరియు కరాటే అకాడమీ విద్యార్థిని మెట్టు హాసిని సీనియర్ 66 కేజీలు 18 సంవత్సరాల కథ లో బంగారు పతకం మరియు కుమితే విభాగంలో వెండి పతకం సాధించారని కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాలు సాధించిన విద్యార్థిని జపాన్ సిటోరియు కరాటే జాతీయ ఉపాధ్యక్షులు పాలకుర్తి పాపయ్య, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ ప్రసన్న, ఇన్స్ట్రక్టర్స్ నాగెల్లి రాకేష్, కావేటి, శివ గణేష్ జడగల, శివానిలు అభినందించారు.

