బిజెపి నాయకులు, రైతులు..
నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రైతులకు పెట్టుబడి సాయం క్రింద 6000 రూపాయలను అందించడం జరుగుతుంది. గత ఎలక్షన్స్ లో మోదీ ఏదైతే రైతులకు యేటా ఈ సమ్మాన్ నిది కింద ఇచ్చే 6000 రూపాయలు మళ్ళీ బీజేపీ అధికారం లోకి రాగానే 10000 లకు పెంచుతారని మాట ఇచ్చి నిలబెట్టుకుని పెంచడం జరిగిందని జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో లో మోదీ చిత్రపటానికి రైతులు కార్యకర్తలు పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు కంకణాలా జ్యోతిభస్, తీగల అశోక్ గౌడ్ మాట్లాడుతూ పెట్టుబడి సాయంని పెంచి నరేంద్ర మోదీ మరొక సారి రైతుల పక్షాన తాను నిలబడి ఉన్నాను అని నిరూపించుకున్నారన్నారు. ఇదే విధంగా తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ ని అధికారం లోకి తీసుకొచ్చినట్లయితే తెలంగాణ రైతాంగానికి ఇంకా మేలు జరిగితుంది అని, ప్రధాని నరేంద్ర మోదీ కి దేశ ప్రజల రైతుల ఆశీస్సులు మెండుగా ఉండి, ఇంకా రైతుల ఉపయోగ కార్యక్రమాలు చేసేవిదంగా ఆ భగవంతుడు మంచి ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు సంకెండ్ల నర్సయ్య, వడ్లకొండ సంపత్, చిప్ప వెంకటేశం, కొక్కుల భద్రయ్య, గూడూరి నరేష్, వడ్నాల సురేష్, ఉప్పుల మని, పెసరు రాజు, ఉప్పుల రాము, ఇస్కిల సంపత్, రైతులు పాల్గొన్నారు

