పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య..
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఉపాధ్యాయ నిరుద్యోగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులను సందర్శించి మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ గెలుపే నా జయం అనే నినాదంతో ముందుకు పోతున్నానని ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై త్వరలోనే ఒక మేనిఫెస్టో రూపొందించి విడుదల చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయ ,అధ్యాపక సమస్యలను తీర్చడంలో మేమున్నాము అనే మనోధైర్యాన్ని కల్పించిన ఘనత మన ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలదని గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్స్ అందరూ రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకమైన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ప్రైవేట్, జూనియర్, డిగ్రీ కళాశాలల, ప్రైవేట్ పాఠశాలల లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై గత 18 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. యాజమాన్య, అధ్యాపక సమస్యలు పరిష్కారం కావాలంటే రాజకీయాల కతీతంగా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. తనకు స్వచ్ఛంద సంస్థలు ,కుల సంఘాల మద్దతు ఉందన్నారు. మేధావి వర్గం ఆచితూచి సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే పోరాడుతారో ఆలోచన చేసి మీ అభ్యర్థి అయినా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, పత్తి రాజిరెడ్డి, వేణుమాధవ్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, రాజు, స్వాతి, జగన్, ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

