- సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను 3 నెలలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గట్టపల్లి, శివాలయం మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్ నుంచి జెండా వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో టి.యూ.ఎఫ్., ఐ.డి.సి, డి. ఎం. ఎఫ్. టి, ఎస్.డి.ఎఫ్ కింద మంజూరై చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైయిన్ పనులు 3 నెలల కాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలిపోయే పరిస్థితికి వచ్చినందుకు నూతన భవనం మంజూరు అయిందని ప్రస్తుత విద్యార్థులను అనువైన మరో భవనానికి తరలించి పాత భవనాన్ని తొలగించె పనులు ప్రారంభించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్, సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

