- బ్యాంకింగ్ సేవల గురించి వివరణ
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి హర్షిత అధ్యక్షతన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కమలాపూర్ శాఖ ఆధ్వర్యంలో కమలాపురం గ్రామ కూడలి వద్ద రోడ్ షో నిర్వహించారు. ఇట్టి రోడ్ షో లో భాగంగా తమ బ్యాంక్ కల్పిస్తున్న ఋణసదుపాయాలు, డిపాసిట్ సేవలు, ఇన్సూరెన్సు సేవలు గురించి వివరించారు. తమ బ్యాంక్ తక్కువ వడ్డీతో ముద్ర లోన్స్, PMEGP లోన్స్ PMFME లోన్స్, గృహ రుణాలు, వాహన రుణాలు, బిజినెస్ లోన్స్, విద్యా రుణాలు, అందచేస్తున్నామని వాటికి కావాల్సిన, సమర్పించవలసిన డాక్యుమెంట్స్ పత్రాలను గురించి తెలిపారు. అలాగే డిపాసిట్స్ మీద అధిక వడ్డీ తమ బ్యాంక్ అందజేస్తున్నదని, అలాగే తమ బ్యాంక్ SBI Life ఇన్సూరెన్స్ సేవలు, SBI జనరల్ ఇన్సూరెన్స్ సేవలు, PMJJBY ఇన్సూరెన్సు, PMSBY ఇన్సూరెన్సు, APY పెన్షన్ సేవలను అందజేస్తున్నదని రోడ్ షో కు వచ్చిన ఖాతాదారులకు, ప్రజలకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో TGB, ఉప్పల్ బ్రాంచ్ మేనేజర్ డేవిడ్ మహారాజ్, హబ్ జమ్మికుంట మేనేజర్ రాము, ప్రాసెసింగ్ ఆఫీసర్, బ్యాంక్ సిబ్బంది జాన్ డేవిడ్, మరిము గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

