నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, మన్నె వీరేంద్ర ప్రసాద్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో తాళ్లూరి భారతిదేవి జ్ఞాపకార్థం, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నడుస్తున్న 29 వ నెహ్రు కప్ ప్రైజ్ మనీ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా శనివారం నాడు జరిగిన పోటీలలో డార్క్ లెవెన్, కొత్తగూడెం జట్టు, కే ఎన్ ఆర్, భద్రాచలం జట్టు ఫైనల్ కు చేరుకున్నాయి.శనివారం ఉదయం జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భద్రాద్రి స్పోర్ట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు168 పరుగులు సాధించారు.ఈ జట్టులోని రో్లెక్స్ 64 పరుగులు,నాగేంద్ర గౌడ్ 23 పరుగులు చేశారు.169 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కే ఎన్ ఆర్ భద్రాచలం జట్టు19.5 ఓవర్లలో 169 పరుగులు సాధించి విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టారు.ఈ జట్టులోని ప్రతీక్ 54 పరుగులు, వినయ్ గౌడ్ 46 పరుగులు, చాంద్ పాషా 22 పరుగులు సాధించారు.ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ గౌడ్ కు ఐటిసి పిఎస్ పిడి యూనియన్ నాయకులు సానికొమ్ము శంకర్ రెడ్డి, పర్యావరణ ప్రేమికులు గోళ్ళ భూపతిరావు,నెహ్రూ కప్ గౌరవ సలహాదారులు ఎస్.కె అజీమ్ లు అందించారు. మధ్యాహ్నం జరిగిన రెండవ మ్యాచ్లో వైఎంసిసి ఇల్లందు జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేశారు.నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగుల స్కోర్ సాధించారు. 144 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన డార్క్ లెవెన్ కొత్తగూడెం జట్టు ఒక బంతి మిగిలి ఉండగా 144 పరుగులు సాధించి విజయం సాధించారు. డార్క్ లెవెన్ జట్టులోని పైడిపల్లి శ్రీనివాస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి, భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ, ప్రముఖ కాంట్రాక్టర్ బిలిపిల్లి రంగారెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ ఫౌండర్ తోటమల్ల వెంకట బాలయోగి, అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ఉపాధ్యక్షులు గుమ్ములూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ ఎస్.కె సలీం, కోశాధికారి కుంచాల సదానందం, సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున, ఉదయ్, రమేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

