రోడ్డు భద్రత అవగాహన కల్పించిన సిఐ జి తిరుమల్ గౌడ్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా వాహనదారులకు సిఐ జి తిరుమల్ గౌడ్ రోడ్డు భద్రత అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, తప్పని సరిగా సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలని సూచించారు. మొక్కుబడిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించడం పోలీసుల కోసం కాదని, మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళగానే ఇంటి వద్ద మీ కుటుంబం ఎదురుచూస్తుందని గుర్తుంచుకొని వాహనాలు నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన తమతో పాటు ఎదుటివారి ప్రాణాలకు హాని కలుగుతుందని, ప్రాణాలు కుడా పోతాయి అని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి శిక్షలు కఠిన తరంగా ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా చిన్నపిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని తెలిపారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మైనర్లు చాలామంది ట్రాఫిక్ రూల్స్ తెలియక రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి తప్పు మీరు కూడా చేయవద్దని హెచ్చరించారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కుటుంబాలను చూసి మేల్కొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని అన్నారు. ట్రాఫిక్ నిభందనలు పాటించి ఇతరులకు కుడా ఆదర్శంగా నిలవాలని, ప్రతి పౌరుడుగా అది మీ బాధ్యత అని తెలిపారు.

