Thursday, January 22, 2026

ఖని అంబేద్కర్ విగ్రహానికి నూతన రూపురేఖలు ఐలాండ్ ఏర్పాట్లు

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్): ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులతో మున్సిపల్ అధికారుల సమావేశం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహాన్ని నూతన రూపు రేఖలు ఐలాండ్ ఏర్పాటు చేసేందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, ఇతర దళిత సంఘాల నాయకులతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు వెడల్పు కారణంగా కొద్దిగా వెనక్కి జరిపి ఐలాండ్ ఫౌంటెన్ తోపాటు నూతన హంగులతో విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు దళిత సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐలాండ్ ఫౌంటెన్ తో పాటు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ. శివానంద్ ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ అధికారులతో కలిసి విగ్రహ ఐలాండ్ అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను పరిశీలించడం జరిగింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మార్నింగ్ కమిటీ సభ్యులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బొంకూరిమధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపల్లి సతీష్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇరుగురాళ్ల కృష్ణయ్య ప్రముఖ సామాజిక సేవకురాలు మాజీ మంత్రి మాతంగి నరసయ్య తనయ సునీత ఆలయ ఫౌండేషన్ సీ ఈ వో తీట్ల రమేష్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు, దుబాసి బొందయ్య, గద్దల శిశు భూషణ్, పెగడపల్లి నారాయణ, శనిగరపు రామస్వామి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, కో కన్వీనర్లు పంజా అశోక్, గొర్రె నర్సింగరావు ఏ ఐ టీ యూ సీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎం.ఏ కరీం ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ పుల్లూరు మహేందర్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణిగుంట్ల నరేందర్, బూడిద భాగ్యలక్ష్మి, జిన్నత్ బేగం, తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News