నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : విశాఖపట్నంలో నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలను వీక్షించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, సతీమణి నారా భువనేశ్వర్ ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సతీమణి స్వాతి కలుసుకున్నారు. ఈ మేరకు శనివారం వారిని కలుసుకొని దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ, రాజకీయ పరిస్థితులను చర్చించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలను తీర్చాలని సీఎం చంద్రబాబు సూచించారని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. క్రమశిక్షణతో పాలన అందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సీ.ఎం. పేర్కొన్నారని తెలిపారు.

