Thursday, January 22, 2026

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర

  • నియోజకవర్గ స్థాయిలో పట్టణ, మండల అధ్యక్షుల నియామకం.
  • ఇన్నాళ్ల నిరీక్షణకు తెర.
  • పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రణవ్ సూచన.
  • పదవుల ప్రకటనతో కాంగ్రెస్ లో నయా జోష్.

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట పట్టణ, మండల, వీణవంక, ఇళ్ళందకుంట మండలాల పార్టీ అధ్యక్షుల నియామకం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి, మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్, మండల అధ్యక్షుడిగా వీరమనేని పర్శరామరావు, వీణవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఇళ్ళందకుంట మండల అధ్యక్షుడిగా పెద్ది కుమార్ లు నియమితులైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ తగిన గుర్తింపు ఇస్తామని, కార్యకర్తలను కాపాడుకుంటామని, ఎవరు అధైర్యపడొద్దని అందరికీ అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని బలపరచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నుండి మెజారిటీ స్థాయిలో సీట్లు పొంది ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, హుజురాబాద్ వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరి-స్వామిరెడ్డి, హనుమాన్ దేవాలయ చైర్మెన్ కొలిపాక శంకర్, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, సాహెబ్ హుస్సేన్, సొల్లు బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News