రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల అమలుకు సిగ్నల్
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, పాలభిషేకం చేసిన దొంత సుధాకర్
నేటి సాక్షి, సైదాపూర్:
సైదాపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు ప్రవేశపెట్టినందున చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే రవాణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు వె.సైదాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పాలాభిషేకం చేయ్యడం జరిగింది. దొంత సుధాకర్ మాట్లాడుతూ మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం పథకాలు అమలుచేసే ఈ ప్రకారం.. ఎకరానికి తొలి విడతగా 6 వేల చొప్పున ఇవ్వాలంటే.. మొత్తం రూ.7,800 కోట్లు అవసరం. మొత్తం 62 లక్షల మంది రైతులకు జనవరి 26 నుంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వ్యవసాయ దారులకు ప్రతి ఎకరాకు రైతుభరోసా పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం పట్ల,మరియు భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఏటా రూ. 12 వేలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు పథకాలను ఈనెల 26 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్త చేస్తున్నారు అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎర్రల శ్రీనివాస్, పెద్ది తిరుపతి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, భాషవేణి తిరుపతి, లక్ష్మణ్, గొపగోని నవీన్, అనగోని శ్రీనివాస్, గుంటి స్వామి, మేకల రాజు, గుర్రం వాసుదేవ్, పూసల అశోక్, పున్నం రాంమూర్తి, గున్నాల కృష్ణమూర్తి, గొల్లపల్లి రాజయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు బోనగిరి అనిల్, బానోతు తిరుపతి నాయక్, వేముల సునీల్, తిప్పారపు సాయికిరణ్ గార్లు పాల్గొన్నారు.

