
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం సుల్తానాబాద్ మండలం నిమ్మనపల్లి గ్రామంలోని లంబులాద్రి గుడి ఆవరణలో గ్రామ శాఖ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశాలి సంఘం మచ్చ యాదగిరి, వడ్లకొండ ప్రకాష్, వడ్లకొండ లింగమూర్తి, పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సమ్మేళన కార్యక్రమాలను పెట్టడం చాలా సంతోషంగా ఉందని పద్మశాలీలు ఐక్యతతో ఉండి ఏదైనా సాధించవచ్చని
రాజకీయరంగంలో కూడా మనం ఎదగాలని ఎవరికి తలంచవద్దని అన్ని రంగాలలో పద్మశాలీలు ముందుండాలని మనం పద్మశాలి బిడ్డలమై పుట్టినందుకు చాలా గర్వించాల్సిన విషయమని
అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మచ్చ కనకయ్య, వడ్లకొండ కనకయ్య, వెంగళ వెంకటేశం, వెంగళ శ్రీనివాస్, మడిపేద్ది చంద్రయ్య, పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు.

