- గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన బిఆర్ఎస్ పార్టీ
- రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కండ్లలో నిప్పులు పోసుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్):
పథకాలు అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పారండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. ఆదివారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోంది, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ప్రతి ఎకరానికి రూ. 12 వేలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో భూమిలేని కూలీలకు కూడా రూ. 12 వేలు ఇవ్వాలని సీఎం ప్రకటించారు. జనవరి 26వ తేదీ నుండి ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు అవుతుంది.గత పది ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బి,ఆర్ఎస్ ప్రభుత్వం,కెసిఆర్ రాష్ట్రాన్ని మారుతికంగా దివాలా తీయించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా దోపిడీ చేసిన, లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన రైతుకు చేదోడు వాదోడుగా ఉండాలని సదుద్దేశంతో ప్రభుత్వం రైతు భరోసా క్రింద ఆర్థిక సాయాన్ని పెంచింది. గత పది ఏళ్లలో ప్రజలు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన కెసిఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. జనవరి 26 వ తేదీ నుండి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో పథకాలు, అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు.ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అమలు చేస్తోంది.రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాల రూప కల్పనకు కృషి చేస్తోంది.
ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్ విండో వైస్ ఛైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, చొప్పదండి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్నాల యగ్నేష్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య , బుర్గు గంగన్న, రోమాల రమేష్, కొల్లిపాక స్వామి,పడ్నాల రాజన్న, దోర్నాల శ్రీనివాసరెడ్డి, బట్టు లక్ష్మీనారాయణ, ర్ర విద్యా సాగర్ రెడ్డి, సత్తు కనుకయ్య, మేర్జ కొండయ్య, అట్లా శేఖర్ రెడ్డి, పడతపల్లి కిషన్, బైరి సంపత్ , రుద్ర మల్లేశం, చందు, కరుణాకర్, మధు, సతీష్ , మంత్రిలత, కొల ప్రభాకర్, ,వేముల అంజి, మంత్రి మహేందర్ ,కుమార్,నవిన్, మ్యాక వినోద్, తదితరులు పాల్గొన్నారు.

